కరువు పీడిత విముక్తికి సమష్టిగా పోరాటం చేద్దాం

ABN , First Publish Date - 2021-07-13T05:13:24+05:30 IST

రాయలసీమ కరువు పీడిత విముక్తికి సమష్టిగా పోరాటాలు చేద్దామని రాయలసీమ ఎత్తిపోతల పఽథకం సాధన సమితి కన్వీనర్‌ దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి పిలుపు నిచ్చారు.

కరువు పీడిత విముక్తికి సమష్టిగా పోరాటం చేద్దాం

రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన సమితి కన్వీనర్‌ దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి

రైల్వేకోడూరు, జూలై 12: రాయలసీమ కరువు పీడిత విముక్తికి సమష్టిగా పోరాటాలు చేద్దామని  రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన సమితి కన్వీనర్‌ దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం రైల్వేకోడూరు పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మండపంలో ఈ పథకంపై అఖిల పక్షం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జిల్లా రైతు సంఘం నేత మలిశెట్టి జతిన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రమౌళీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో అక్రమంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే నిలుపుదల చేయాలని డిమాండు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తిని నిలుపుదల చేయాలన్నారు. కృష్ణా బోర్డు నిర్ణయం, విధి విధానాలు అమలు చేయాలన్నారు.  రాయలసీమలోని నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి మలిశెట్టి రాహుల్‌,  రైతు స్వరాజ్యవేదిక కన్వీనర్‌ పుత్త శివారెడ్డి, సీపీఎం జిల్లా నాయకుడు సీహెచ్‌ చంద్రశేఖర్‌, తెలుగు రైతు పార్లమెంట్‌ నియోజకర్గం అధ్యక్షుడు పెరుగు క్రిష్ణయ్యనాయుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, సీపీఐ సీనియర్‌ నేత ఎస్‌. శంకరయ్య, నాయకులు మహేష్‌,  రాజశేఖర్‌,  మర్రిరెడ్డి రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T05:13:24+05:30 IST