కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడండి

ABN , First Publish Date - 2021-03-23T04:32:53+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడి ఐసీడీఎస్‌లో పనిచేసే సీడీపీఓల దగ్గర నుంచి అంగన్‌వాడీ ఆయాల వరకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఐసీడీఎస్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ పద్మజ తెలిపారు.

కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడండి
మాట్లాడుతున్న ఐసీడీఎస్‌ పీడీ పద్మజ

ప్రొద్దుటూరు అర్బన్‌, మార్చి 22 : కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వీడి ఐసీడీఎస్‌లో పనిచేసే సీడీపీఓల దగ్గర నుంచి అంగన్‌వాడీ ఆయాల వరకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఐసీడీఎస్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ పద్మజ తెలిపారు. సోమవారం స్థానిక మోడంపల్లెలోని ఐసీడీఎస్‌ కార్యాలయంలో అర్బన్‌ రూరల్‌ పరిధిలో పనిచేసే అంగన్‌వాడీ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన సదస్పు నిర్వహించారు. ఈ సందర్బంగా పీడీ మాట్లాడుతూ కరోనా వైరస్‌ మళ్ళీ విజృంభిస్తున్నదని ఐసీడీఎస్‌ సిబ్బంది వ్యాక్సిన్‌ తీసుకోవడం పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. జిల్లాలో ఇంకా 1500 మంది వ్యాక్సిన్‌ వేసుకోలేదన్నారు. వ్యాక్సిన్‌ వేసుకొంటే జ్వరం వస్తుందని అంతకు మించి వేరే సైడ్‌ ఎఫెక్ట్‌లు ఇంతవరకు రాలేదన్నారు. 24 గంటల్లో దాని ప్రభావం బయటపడుతుందన్నారు. 85 శాతం వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి కరోనా సోకదన్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ నజీర్‌ మాట్లాడుతూ వ్యాక్సిన్‌ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని  అపోహలతో వ్యాక్సిన్‌ తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోతారన్నారు. అనవసర భయాలు దూరం చేసుకోవాలని ఇక్కడే వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం చేపడతామని వైద్యులు చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీఓలు హైమావతి, నిర్మలాదేవి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటేశ్వర్లు సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-23T04:32:53+05:30 IST