కుష్ఠు పట్ల అవగాహన అవసరం
ABN , First Publish Date - 2021-02-07T04:38:35+05:30 IST
కుష్ఠు పట్ల విద్యార్థులకు అవగాహన అవస రమని అడి షనల్ డీఎం అండ్ హెచఓ ఖాదర్‌వల్లి పేర్కొన్నారు.

గోపవరం, ఫిబ్రవరి 6: కుష్ఠు పట్ల విద్యార్థులకు అవగాహన అవస రమని అడి షనల్ డీఎం అండ్ హెచఓ ఖాదర్‌వల్లి పేర్కొన్నారు. శనివారం వెలుగు బాలికల పాఠశాలలో విద్యార్థులకు కుష్ఠుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
ఈ వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుందన్నా రు. అయోడిన లోపం వల్ల కలిగే దుష్పరిణామాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మండల వైద్యాఽధికారి డాక్టర్ వాసుదేవరెడ్డి, కుష్ఠు వ్యాధి నివారణాధికారి శంభుప్రసాద్, సీహెచఓ గౌస్, అఖిల, భాను, సిబ్బంది పాల్గొన్నారు.