‘ప్రభుత్వాలను కూడా లీజుకివ్వండి’
ABN , First Publish Date - 2021-08-26T04:36:09+05:30 IST
నడపడం చేతకాక, సంపదను సృష్టించలేక ప్రభు త్వాన్ని కూడా లీజుకు ఇవ్వాలని టీడీపీ నేత రామగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

పులివెందుల టౌన్, ఆగస్టు 25: నడపడం చేతకాక, సంపదను సృష్టించలేక ప్రభు త్వాన్ని కూడా లీజుకు ఇవ్వాలని టీడీపీ నేత రామగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇథోధికంగా ఉపయోగపడుతూ, సేవలందిస్తున్న, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను వారికి కావాల్సిన వారికి లీజుకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం ప్రజ లు జీవించే హక్కును హరించడమేనన్నారు.
జియో కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ను నాశ నం చేశారన్నారు. ఎయిర్‌పోర్ట్స్, పోర్టులు అన్నీ ఆదానీకి ఇచ్చారన్నారు. రోడ్లు, రైళ్లు, బీఎస్‌ఎన్‌ఎల్, కరెంటు, గ్యాస్, మరికొన్ని పరిశ్రమలు మిగిలాయని, మనం కాలు బయట పెట్టాలంటే డబ్బుకట్టి బయటకు రావాలన్నారు. ప్రజలు జీవించే హక్కును కాలరాసే కేంద్ర నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు.