ప్రత్యేక మహిళా జైలు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కృష్ణవేణి
ABN , First Publish Date - 2021-10-30T05:28:35+05:30 IST
కడప సెంట్రల్ జైలులోని ప్రత్యేక మహిళా జైలు సూపరింటెండెంట్‌గా ఎ.కృష్ణవేణి బాధ్యతలు స్వీకరించారు.
కడప(క్రైం), అక్టోబరు 29: కడప సెంట్రల్ జైలులోని ప్రత్యేక మహిళా జైలు సూపరింటెండెంట్‌గా ఎ.కృష్ణవేణి బాధ్యతలు స్వీకరించారు. 1999 బ్యాచ్‌కు చెందిన ఆమె రాష్ట్రంలోని పలు జైళ్లలో డిప్యూటీ జైలర్‌గా విధులు నిర్వహించారు. 2004లో జైలర్‌గా పదోన్నతి పొంది, పలు జిల్లాల్లో పనిచేశారు. తర్వాత 2018లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆమె రాజమండ్రి మహిళా కారాగారంలో పనిచేస్తూ సూపరింటెండెంట్‌గా కడపకు వచ్చారు. కడప సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్రేస్‌మణి ఈ నెల 18వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారించి సూపరింటెండెంట్ వసంతకుమారిని రాజమండ్రికి, జైలర్ భువనేశ్వరిని నెల్లూరుకు బదిలీ చేశారు. సూపరింటెండెంట్‌గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన కృష్ణవేణి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహిళా ఖైదీల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.