సెప్టెంబరు 30 వరకు కొవిడ్‌ నిబంధనలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-08-11T05:22:58+05:30 IST

కొవిడ్‌ నియంత్రణలో భాగంగా వివాహాలు, సంఘాలు, మతపరమైన, ఇతరత్రా అన్ని సమావేశాలకు 150 మందికి మాత్రమే అనుమతిస్తామని కలెక్టర్‌ విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సెప్టెంబరు 30 వరకు కొవిడ్‌ నిబంధనలు : కలెక్టర్‌

కడప (కలెక్టరేట్‌),  ఆగస్టు 10 : కొవిడ్‌ నియంత్రణలో భాగంగా వివాహాలు, సంఘాలు, మతపరమైన, ఇతరత్రా అన్ని సమావేశాలకు 150 మందికి మాత్రమే అనుమతిస్తామని కలెక్టర్‌ విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సెప్టెంబరు 30వ తేదీ వరకు కొవిడ్‌ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 

టపాకాయల లైసెన్సుకు దరఖాస్తు చేసుకోండి

జిల్లాలో టపాకాయల లైసెన్సులు పొందగోరే వారు దరఖాస్తు చేసుకోవాలని డీఆర్‌వో మలోల మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఆసక్తి గల వారు దరఖాస్తులను సెప్టెంబరు 9వ తేదీలోగా కలెక్టరేట్‌లోని సి.సెక్షన్‌ కార్యాలయంలో నేరుగా అందచేయాలన్నారు. రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, తహసీల్దార్లు సూచించిన ప్రదేశాల్లోనే టపాకాయల విక్రయాలు జరుపుకోవాలన్నారు నిబంధనలు అతిక్రమించి వేరే ప్రదేశాల్లో టపాకాయల విక్రయాలు జరిపితే  లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. 

Updated Date - 2021-08-11T05:22:58+05:30 IST