కొవిడ్ నిబంధనలు పాటించాలి : ఎస్‌ఐ
ABN , First Publish Date - 2021-05-09T04:53:19+05:30 IST
నిబం ధనలు పాటిస్తూ రంజాన పం డుగను చేసుకువాలని ముస్లింల కు ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి సూచిం చారు.

పులివెందుల టౌన, మే 8: నిబం ధనలు పాటిస్తూ రంజాన పం డుగను చేసుకువాలని ముస్లింల కు ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి సూచిం చారు. స్థానిక పోలీస్‌స్టేషన వద్ద ముస్లిం మతపెద్దలతో నిర్వహిం చిన సమావేశంలో బడేరాత, ప్రార్థనా సమయాల్లో పరిమితికి మించి ఎక్కువ మంది గుమిగూ డకుండా ఉండాలని ఎస్‌ఐ సూచించారు. మాస్కులు విధిగా ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవా లన్నారు. కరోనా నియంత్రణకు సహకరించాలని ఎస్‌ఐ కోరారు.