యాదాద్రి ఆలయానికి కిలో బంగారం విరాళం

ABN , First Publish Date - 2021-10-21T04:57:41+05:30 IST

తెలంగాణలోని యాదాద్రి ఆలయానికి కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తున్నామని ప్రముఖ పారిశ్రామికవేత్త, కడప జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ సభ్యురాలు మోడం జయమ్మ బుధవారం తెలిపారు.

యాదాద్రి ఆలయానికి కిలో బంగారం విరాళం
మాట్లాడుతున్న జడ్పీటీసీ సభ్యురాలు మోడెం జయమ్మ

ప్రకటించిన చిన్నమండెం జడ్పీటీసీ సభ్యురాలు


చిన్నమండెం, అక్టోబరు 20:
తెలంగాణలోని యాదాద్రి ఆలయానికి కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తున్నామని ప్రముఖ పారిశ్రామికవేత్త, కడప జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ సభ్యురాలు మోడం జయమ్మ బుధవారం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా యాద్రాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణం ఒక గొప్ప యజ్ఞంలా సాగిస్తున్నారని అన్నారు. పునర్నిర్మాణంలో భాగంగా గర్భగుడికి బంగారుతాపడం చేయడానికి 125 కిలోల బంగారం అవసరమని సీఎం ప్రకటించారన్నారు. ఆ ప్రకటన మేరకు దేవాలయానికి తమ కుటుంబం ఒక కిలో బంగారం విరాళంగా ఇస్తోందన్నారు. ఈ మేరకు కేసీఆర్‌ యాదాద్రి పర్యటించినప్పుడు స్వామివారి సన్నిధిలో ఆయనకు చెక్కును అందజేస్తామన్నారు. తాము ఇప్పటికే కిలో బంగారం ఇస్తున్న విషయాన్ని తెలంగాణ సీఎంఓ కార్యాలయానికి తెలిపామని వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం, ఆభగవంతుడు తమకు ప్రసాదించిన వరంలా భావిస్తున్నట్లు ఆమె కుమారుడు వీరాంజనేయప్రసాద్‌ అన్నారు.

Updated Date - 2021-10-21T04:57:41+05:30 IST