అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచండి : డీఎస్పీ

ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST

నగరంలో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, జూదం, బెట్టింగ్‌, వ్యభిచారం లాంటి వాటిపై నిఘా ఉంచాలని డీఎస్పీ సునీల్‌ సిబ్బందికి సూచించారు.

అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచండి : డీఎస్పీ

కడప(క్రైం), జూన్‌ 21: నగరంలో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, జూదం, బెట్టింగ్‌, వ్యభిచారం లాంటి వాటిపై నిఘా ఉంచాలని డీఎస్పీ సునీల్‌ సిబ్బందికి సూచించారు. సోమవారం నుంచి ప్రభుత్వం కర్ఫ్యూలో సడలింపు ఇచ్చిందని, ఆ లోపే షాపులు తెరచి ఉండాలని, మిగతా సమయంలో షాపులు తెరవకుండా చూసుకోవాలన్నారు. అలాగే అనవసరంగా బయట తిరిగే వ్యక్తుల వాహనాలకు జరిమానాలు వేయాలని సూచించారు. ఏదైనా గొడవలు కానీ, జనాల సమీకరించుకున్నా తక్షణమే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Updated Date - 2021-06-21T05:30:00+05:30 IST