కస్తూర్బా పాఠశాల తనిఖీ

ABN , First Publish Date - 2021-02-06T05:16:31+05:30 IST

మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను శుక్రవారం రాష్ట్ర జీసీడీవో మాధురి ఆకస్మిక తనిఖీ చేశారు.

కస్తూర్బా పాఠశాల తనిఖీ

పెండ్లిమర్రి, ఫిబ్రవరి 5: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను శుక్రవారం రాష్ట్ర జీసీడీవో మాధురి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అనంతరం పాఠశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ జీసీడీవో కమాల్‌బీ, ఎంఈవో సుజాత, ఎస్‌వో ఫణిశ్రీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T05:16:31+05:30 IST