ప్రారంభమైన కార్తీకమాస పూజలు

ABN , First Publish Date - 2021-11-06T05:12:12+05:30 IST

హరిహరులకు ప్రీతిపాత్రమైన మా సం కార్తీక మాసం. భక్తులు నోట విని పించే శ్రావణ మా సం పూజలు శుక్రవా రం నుంచి ప్రారంభ మయ్యాయి.

ప్రారంభమైన కార్తీకమాస పూజలు
ప్రత్యేక అలంకరణలో మరకతలింగం - ఆకాశదీపం పూజలు చేస్తున్న మహిళలు

మైదుకూరు, నవంబ రు 5: హరిహరులకు ప్రీతిపాత్రమైన మా సం కార్తీక మాసం. భక్తులు నోట విని పించే శ్రావణ మా సం పూజలు శుక్రవా రం నుంచి ప్రారంభ మయ్యాయి. స్థానిక భీమేశ్వరస్వామి ఆలయంలో ఆలయ ఛైర్మన్‌ భూమిరెడ్డి సుబ్బరాయుడు పర్యవేక్షణలో అర్చ కులు మాదవాచారి మరకత లింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

రాత్రి మహిళలు ఆకాశదీపం పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. నెల రోజుల పాటు రుద్రాభిషేకం నిర్వహిచనున్నట్లు పేర్కొన్నారు. వచ్చిన భక్తాదులకు తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్తీక మాసం సందర్భంగా పట్టణంలోని సాయిబాబా ఆలయంలో శుక్రవారం మేకువజామున భక్తులకు  గురుస్వామి ద్వారా అయ్యప్పమాలను ధరించి దీక్ష చేపట్టారు. 

Updated Date - 2021-11-06T05:12:12+05:30 IST