వైఎస్సార్‌కు షర్మిల, విజయమ్మ నివాళులు
ABN , First Publish Date - 2021-07-08T14:10:15+05:30 IST
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపాయలోని వైఎస్ ఘాట్ వద్ద కూతురు షర్మిల, భార్య విజయమ్మ నివాళులర్పించారు.

కడప: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద సతీమణి విజయమ్మ, కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం తెలంగాణలో నేడు నూతన పార్టీ జెండా, అజెండాను ప్రకటించనున్న నేపథ్యంలో తండ్రి సమాధిపై నూతన పార్టీ జెండాను వేసి వైఎస్ షర్మిల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి రోడ్డు మార్గాన కడప విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల తెలంగాణకు బయలుదేరి వెళ్లనున్నారు. తెలంగాణ వైఎస్ షర్మిల పార్టీ నేతలు, ప్రజలు వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు.
మరోవైపు తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భావానికి అంతా సిద్ధమైంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో షర్మిల తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. షర్మిల పెట్టబోయే పార్టీ పేరు వైఎ్‌సఆర్ తెలంగాణ పార్టీ అన్న సంగతి తెలిసిందే. పార్టీ పేరును ప్రకటించడంతో పాటు పార్టీ జెండానూ షర్మిల ఆవిష్కరించనున్నారు.