సాయంత్రం వేళలో వైఎస్‌కు నివాళులర్పించనున్న సీఎం జగన్

ABN , First Publish Date - 2021-07-08T13:44:43+05:30 IST

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సాయంత్రం వేళలో వైఎస్‌కు నివాళులర్పించనున్న సీఎం జగన్

కడప: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా తొలిసారిగా సీఎం జగన్ సాయంత్రం వేళలో ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. అయితే ఇలా చేయడం సాంప్రదాయాలు, ఆచారాలకు విరుద్ధమని పెద్దలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.  వైఎస్ జయంతి వేడుకల్లో  సమయవేళ మార్పు కోసం అన్నాచెల్లెల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. షర్మిళ ఉదయం సమయం మార్పు కోసం ఒప్పుకోకపోవడంతోనే సీఎం జగన్ సాయంత్రం షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-07-08T13:44:43+05:30 IST