Kadapaలో దంపతుల దారుణ హత్య
ABN , First Publish Date - 2021-09-03T14:41:27+05:30 IST
జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం కొత్త బసాపురంలో నాగయ్య - నాగమ్మ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు.

కడప: జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం కొత్త బసాపురంలో నాగయ్య - నాగమ్మ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తుండగా వీరయ్య అనే వ్యక్తి దంపతులపై దాడి చేసి కిరాతంగా హత్య చేశారు. హంతకుడు వీరయ్య.. నాగమ్మకు స్వయానా చెల్లెలు కొడుకు. వీరి స్వగ్రామం చాపాడు మండలం నాగులపల్లె. మానసిక పరిస్థితి సరిగా లేక పెద్దమ్మ నాగమ్మ, పెద్దనాన్న నాగయ్యలను హత్యలు చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. హత్యకు పాల్పడిన వీరయ్య ఆ ప్రదేశంలోని ఓ ఇంట్లో దాగి ఉండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.