నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-12-08T04:53:35+05:30 IST

గత నెలలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పంటనష్టంతో పాటు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని భారతీయ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు ఉట్టి శ్రీనివాసులు కోరారు.

నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి

కలెక్టరుకు విన్నవించిన కిసాన్‌ మోర్చా నేతలు


ప్రొద్దుటూరు అర్బన్‌, డిసెంబరు 7 : గత నెలలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పంటనష్టంతో పాటు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని భారతీయ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు ఉట్టి శ్రీనివాసులు కోరారు. మంగళవారం కలెక్టరు విజయరామరాజును కిసాన్‌ మోర్చా నేతలు కలిసి రైతులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల్లో పంట నష్టపోయిన రైతుల వివరాలు ప్రకటిస్తామని కలెక్టరు వెల్లడించారన్నారు. ప్రొద్దుటూరు, రాజుపాళెం పెద్దముడియం, కమలాపురం, ఎర్రగుంట్ల మండలాలకు చెందిన రైతుల వివరాలు కలెక్టరుకు అందజేశామన్నారు. కార్యక్రమంలో బీజేపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ గొర్రెకృష్ణ, కడప కన్వీనర్‌ లక్ష్మణరావు, ప్రభుకుమార్‌, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు ప్రవీణకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T04:53:35+05:30 IST