జాయింట్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2021-09-04T05:02:47+05:30 IST

మండలంలోని రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలను జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) గౌతమి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పెంట-2, కొలుములపల్లె, ఊటుకూరు, విశ్వనాథపురం గ్రామ సచివాలయాలను ఆమె తనిఖీ చేశారు.

జాయింట్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
సచివాలయాలను తనిఖీ చేస్తున్న జేసీ

సీకేదిన్నె, సెప్టెంబరు 3: మండలంలోని రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలను జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) గౌతమి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పెంట-2, కొలుములపల్లె, ఊటుకూరు, విశ్వనాథపురం గ్రామ సచివాలయాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దారు మహేశ్వర్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-09-04T05:02:47+05:30 IST