ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి: డీవైఎ్‌ఫఐ

ABN , First Publish Date - 2021-06-23T05:02:39+05:30 IST

రాష్ట్రంలోని వివిఽధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.83 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డీవైఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు ముడియం చిన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి: డీవైఎ్‌ఫఐ

అట్లూరు, జూన్‌ 22: రాష్ట్రంలోని వివిఽధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.83 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డీవైఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు ముడియం చిన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక డీవైఎ్‌ఫఐ కార్యాలయంలో మంగ ళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల  సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావంతులైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన వైపీసీ ప్రభుత్వ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చి న మాట ప్రకారం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. డీవైఎ్‌ఫఐ నాయకులు నరసింహ, శివ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T05:02:39+05:30 IST