‘జజ్జనకిడి జనకిడి...’

ABN , First Publish Date - 2021-07-28T04:59:07+05:30 IST

టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ తాజాగా అంధుడి వేషంలో వైసీపీ పాలనపై సెటైర్లు విసిరారు.

‘జజ్జనకిడి జనకిడి...’
అంధుడిగా నటిస్తూ పాట పాడుతున్న పంతగాని

సోషల్‌ మీడియాలో పంతగాని సందడి


రైల్వేకోడూరు, జూలై 27 : టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ తాజాగా అంధుడి వేషంలో వైసీపీ పాలనపై సెటైర్లు విసిరారు. రెండు నిమిషాల పాటను చిత్రీకరించి యూట్యూబ్‌లోకి ఎక్కించారు. సోషల్‌ మీడియాలో ఇప్పుడిది హల్‌చల్‌ చేస్తోంది.  ‘జజ్జినకిడి జనకిడి...జాజిమల్లెల అలికిడి...జంతర్‌ మంతర్‌ గారడి...జలగన్న టీమ్‌ ది’’ అంటూ మొదలయ్యే పాటకు నరసింహ ప్రసాద్‌ గుడ్డివాడిగా అభినయించారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనల మీద  కళారూపాల ద్వారా సోషల్‌ మీడియా వేదికగా ఆయన జనంలోకి వెళ్తున్నారు. నరసింహ ప్రసాద్‌ పంతగాని అని యూట్యూబ్‌లో కొడితే చాలు ఈయన చేసిన చిత్రవిచిత్ర వీడియోలు కనిపిస్తాయి. 

Updated Date - 2021-07-28T04:59:07+05:30 IST