జగనన్నా.. మా వేతనాలు తగ్గించవద్దన్నా..!

ABN , First Publish Date - 2021-07-09T05:18:46+05:30 IST

ఆర్టీపీపీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న తమకు జీవోనెంబరు 11 వల్ల వేతనాలు భారీగా తగ్గిపోయాయని వెంటనే ముఖ్యమంత్రి జగ నన్నా స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు.

జగనన్నా.. మా వేతనాలు తగ్గించవద్దన్నా..!

 ఆర్టీపీపీ కాంట్రాక్టు కార్మికుల వినతి

ఎర్రగుంట్ల, జూలై 8: ఆర్టీపీపీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న తమకు  జీవోనెంబరు 11 వల్ల  వేతనాలు భారీగా తగ్గిపోయాయని వెంటనే ముఖ్యమంత్రి జగ నన్నా స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఆమేరకు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని  నేరుగా కలిసే అవకాశం లేకపోవ డం వల్ల పత్రికల ద్వారా సమస్యను విన్నవిస్తున్నామని బాధితులు ఐ.సూజాత, కే.కోటేశ్వరమ్మ, శిరీషలు వేడుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీపీపీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తూ ఇటీవల  మా ముగ్గురి భర్తలు  మరణించారన్నా రు. దీంతో వారి స్థానంలో మాకు కాంట్రాక్టు కార్మికులుగా ఉద్యోగాలిచ్చారన్నారు. అయితే వారికి 2018 నుంచి జీవో నెంబరు 409ప్రకారం రూ.16,500జీతాలిచ్చేవార న్నారు.  మాకు ప్రస్తుతం రూ.5,500 మూలవేతనం, రూ.3,500 వేరియబుల్‌ డియర్నె స్‌ అలవెన్స్‌ (వీడిఏ) పాయింట్స్‌తో కలిపి రూ.9,000 మాత్రమే ఇస్తున్నారన్నారు. జీవో నెంబరు 11 కాంట్రాక్టు కార్మికుల జీవితాల్లో చీకట్లు నింపిందని దీని వల్ల మాకు సుమారు సగం జీతం కోల్పోతున్నామన్నారు. ముఖ్యమంత్రి మాపై దయతలచి వెంటనే జీవోను రద్దు చేసి పూర్తి జీతమిచ్చి వెలుగులు నింపాలని వారు విజ్ఞప్తి చేశారు. కుటుంబాన్ని పోషించే వారు కోల్పోయిన తాము పిల్లలను ఎలా చదివించు కోవాలో  అర్థంకాక ఇబ్బందులు పడుతున్నామన్నారు.

Updated Date - 2021-07-09T05:18:46+05:30 IST