లంచం ఇచ్చినా.. పుచ్చుకున్నా నేరమే

ABN , First Publish Date - 2021-10-30T05:14:29+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకున్నా, ఇచ్చినా నేరం అవుతుందని అవినీతి నిరోదకశాఖ డీఎస్పీ కంజాంక్షన్‌ అన్నారు.

లంచం ఇచ్చినా.. పుచ్చుకున్నా నేరమే

రామాపురం, అక్టోబరు29: ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకున్నా, ఇచ్చినా నేరం అవుతుందని అవినీతి నిరోదకశాఖ డీఎస్పీ కంజాంక్షన్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులకు విజిలెన్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 నుంచి నవంబరు 1వ తేదీ వరకు విజిలెన్స్‌ వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.  అనంతరం ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోస్టర్లు అవినీతి నిరోధకశాఖ టోల్‌ ఫ్రీ నెంబర్లను అతికించారు. 


Updated Date - 2021-10-30T05:14:29+05:30 IST