జాతీయ యువజన అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-11-10T05:11:12+05:30 IST

జాతీయ యువజన అవార్డు కొరకు జిల్లాలోని అర్హులైన స్వచ్ఛంద సంస్థల వారు దరఖాస్తు చేసుకోవాలని స్టెప్‌ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎం.రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో కోరారు.

జాతీయ యువజన అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

స్టెప్‌ సీఈవో రామచంద్రారెడ్డి


కడప(మారుతీనగర్‌), నవంబరు 9: జాతీయ యువజన అవార్డు కొరకు జిల్లాలోని అర్హులైన స్వచ్ఛంద సంస్థల వారు దరఖాస్తు చేసుకోవాలని స్టెప్‌ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎం.రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. భారత ప్రభుత్వ యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ విజయవాడ వారి ఉత్తర్వుల మేరకు 2019-20 సంవత్సరానికి సంబంధించి జాతీయ యువజనుల అవార్డుల (యన్‌వైఎ) కొరకు జిల్లాలోని అర్హులైన వ్యక్తిగత, స్వచ్ఛంద సంస్థల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 14వ తేదీ లోగా కలెక్టరేట్‌లోని జిల్లా యువజన సర్వీసుల శాఖ (డి.బ్లాక్‌) స్టెప్‌ కార్యాలయానికి దరఖాస్తులు పంపాలన్నారు. జాతీయ అభివృద్ధి, సాంఘీక సేవా కార్యక్రమాలైన ఆరోగ్య పరిశోధన, ఆవిష్కరణ, మానవహక్కుల కల్పన, కళలు, సాహిత్యం, పర్యాటకం, సాంప్రదాయ, సాంఘీక సేవా కార్యక్రమాలు, క్రీడలు, విద్యా సంబంధంగా అద్బుతమైన ప్రతిభ, స్మార్ట్‌ లెర్నింగ్‌లో విశిష్టమైన సేవలు చేసినవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08562- 241617 అనే నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

Updated Date - 2021-11-10T05:11:12+05:30 IST