స్థలాల ఆక్రమణలపై విచారణ చేపట్టండి

ABN , First Publish Date - 2021-06-23T05:23:54+05:30 IST

మండల పరిధిలోని అమృత నగర్‌లో పేదల ఇంటి స్థలాల ఆక్రమణలపై రెవెన్యూ అధికా రులు సమగ్ర విచారణ జరపాలని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధ్య క్షుడు సుధాకర్‌ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు.

స్థలాల ఆక్రమణలపై విచారణ చేపట్టండి

ప్రొద్దుటూరు అర్బన్‌, జూన్‌ 22: మండల పరిధిలోని అమృత నగర్‌లో పేదల ఇంటి స్థలాల ఆక్రమణలపై రెవెన్యూ అధికా రులు సమగ్ర విచారణ జరపాలని ఎంఆర్‌పీఎస్‌  జిల్లా అధ్య క్షుడు సుధాకర్‌ మాదిగ  ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఎంఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో ఆక్రమణలపై డిప్యూటీ తహసీ ల్దారు మనోహర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమృతనగర్‌లో ముఠాలుగా ఏర్పడి వందలాది పేదల గృహాలు, స్థలాలు ఆక్రమించుకొని వ్యాపారా లు చేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా ఓ సీపీఎం నేత పేదల ఇంటి స్దలాలను ఆక్రమించి తన అనుచ రులకు కట్టబెట్టడం జరిగిందని రెవెన్యూఅధికారులు అసలైన లబ్ధిదారులకు స్థలాలు చూపెడితే వారివి దొంగపట్టాలని తప్పుడు ఆరోపణలుచేయడం సరికాదన్నారు. ప్రభుత్వం కోట్లు వెచ్చించి పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే వాటిని కబ్జాదారులు హస్తగతం చేసుకుం టున్నారన్నారు. రెవెన్యూ సిబ్బంది వారం పది రోజులపాటు సర్వేచేస్తే కబ్జాల బాగోతం వెల్లడవుతుంద న్నారు. కార్యక్రమంలో సంచార జాతుల సంఘం అధ్యక్షుడు శివక్రిష్ణ ఎంఆర్‌పీఎస్‌ నేత కొండయ్య పాల్గొన్నారు

Updated Date - 2021-06-23T05:23:54+05:30 IST