పార్నపల్లెలో ఇంటింటా ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2021-09-04T05:01:29+05:30 IST

పార్నపల్లెలో శుక్రవారం ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించి జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ గ్రామంలో పర్యటించారు.

పార్నపల్లెలో ఇంటింటా ఫీవర్‌ సర్వే
పార్నపల్లెలో ఫీవర్‌ సర్వేను పరిశీలిస్తున్న జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ

లింగాల, సెప్టెంబరు 3: పార్నపల్లెలో శుక్రవారం ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించి జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ గ్రామంలో పర్యటించారు. పార్నపల్లెలో వైద్యశిబిరం నిర్వహించిన ఆమె ప్రజలకు పలు సూచనలు చేశారు. రాత్రిపూట దోమతెరలు వాడాలని, ఇళ్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలన్నారు.

ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రైడే పాటించి అ న్ని నీటి నిల్వలను, పాత్రలను శుభ్రపరిచి తిరిగి నీరు నింపాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య సీహెచ్‌ఓ శివరాం, పులివెందుల మలేరియా సబ్‌యూనిట్‌ అధికారి సిద్దయ్య, పీహెచ్‌ఎన్‌ కృష్ణవేణి, సూపర్‌ వైజర్‌ కుసుమకుమారి, ఆషియా బేగం, ఆరోగ్య కార్యకర్తలు భాస్కర్‌, నాగే శ్వరి, శ్యామల, ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-04T05:01:29+05:30 IST