నేటి నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ల కోసం ఇంటర్వ్యూలు
ABN , First Publish Date - 2021-12-27T05:10:23+05:30 IST
వైవీ యూనివర్సిటీలో నేటి నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం కోసం ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

కడప(వైవీయూ), డిసెంబరు 26: వైవీ యూనివర్సిటీలో నేటి నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం కోసం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ ఇంటర్వ్యూలకు సంబంధించి విషయ నిపుణు లు మద్రాసు ఐఐటీ నుంచి రానున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీలు 45 ఉన్నాయి. ఇప్పటికే సంబంధిత అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. ఈ ఇంటర్వ్యూలు రెండు రోజులపాటు యూనివర్సిటీలోని పరిపాలన భవనంలోని వీసీ చాంబర్‌లో జరుగనున్నాయి. యూనివర్సి టీలో అసోసియేషన్ల ప్రొఫెసర్ల నియామకం కోసం పారదర్శకంగా నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపట్టారు.