పెట్రో ధరల భారంపై వినూత్న నిరసన

ABN , First Publish Date - 2021-10-29T04:59:50+05:30 IST

పెరిగిన పెట్రో ధరలను నిరసిస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో కారు కు తాడు కట్టి నెల్లూరురోడ్డు నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు లాగుతూ ఆ పార్టీ నేతలు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు.

పెట్రో ధరల భారంపై వినూత్న నిరసన
రోడ్డుపై వంట చేస్తున్న వామపక్ష పార్టీల నేతలు

రోడ్డుపై వంటావార్పు, తాడుతో కారును లాగిన సీపీఐ, సీపీఎం నేతలు

బద్వేలు,అక్టోబరు 28: పెరిగిన పెట్రో ధరలను నిరసిస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో కారు కు తాడు కట్టి  నెల్లూరురోడ్డు నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు లాగుతూ ఆ పార్టీ నేతలు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర సమి తి ఇచ్చిన పిలుపులో భాగంగా చేపట్టిన నిరసనలో సీపీఐ ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ

దేశంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక పార్లమెంటులో పూర్తిస్థాయి మెజార్టీ సాధించిన తర్వాత అర బానీ, ఆదాని లాంటి కార్పొరేట్‌ శక్తులకు  కట్టబెట్టేందుకు వా రిపట్ల స్వామిభక్తిని  ప్రదర్శించేందుకు దేశంలో  ఆర్థిక వనరైన పెట్రో ధరలు పెంచడం, ఎల్‌ఐ సీ, బ్యాంకింగ్‌, రైల్వే వంటి వాటిని ప్రైవేటుప రం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు పాల్గొన్నారు.

పోరుమామిళ్ల, అక్టోబరు 28: పెట్రో ధరల ను వెంటనే తగ్గించాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. పోరుమామిళ్లలో ధరలు తగ్గించాలని కోరుతూ పెట్రోల్‌ బంక్‌ వద్ద స్కూటర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భం గా సీపీఎం మండల కార్యదర్శి సభ్యులు గౌసియాబేగం, అబ్దుల్లా మాట్లాడుతూ భారత దేశంలో కరోనా వల్ల 130 కోట్ల జనాభా గల కు టుంబాలు చిన్నాభిన్నమై ఆర్థిక వ్యవస్థ క్షీణించిందన్నారు.  కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పిన్నం వెంకటసుబ్బయ్య, రఫాయిల్‌, బీబీ, నారాయణమ్మ పాల్గొన్నారు. 

మైదుకూరు, అక్టోబరు 28: నిత్యం పెరుగు తున్న ధరలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన చేశారు. తహ సీల్దారు కార్యాలయం ఆవరణలో నిరసన వ్య క్తం చేసిన అనంతరం ఖాళీ సిలిండర్‌ పెట్టి కట్టెలతో పొయ్యి వెలిగించి వంట చేశారు. ఆటోను తాడుతో లాగుతూ  వినూత్న నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నేతలు శ్రీరాములు, ఏవీ శివరాం, జి శివ కుమార్‌, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.  Updated Date - 2021-10-29T04:59:50+05:30 IST