రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు గాయాలు

ABN , First Publish Date - 2021-11-01T04:57:31+05:30 IST

సిద్దవటం ఫారెస్ట్‌ చెక్‌పోస్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీధర్‌ అనే కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు గాయాలు

సిద్దవటం, అక్టోబరు 31 : సిద్దవటం ఫారెస్ట్‌ చెక్‌పోస్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీధర్‌ అనే కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. జీఆర్‌ పల్లె పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్‌ శ్రీధర్‌ శనివారం బద్వేలులో ఎన్నికల విధులు ముగించుకుని సిద్దవటం మీదుగా కడపకు వస్తుండగా సిద్దవటం చెక్‌పోస్టు వద్ద ద్విచక్ర వాహనానికి అడవిపందులు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి అదుపు తప్పి కింద పడటంతో గాయాలయ్యాయి. అతని చేతిలో ఉన్న తుపాకీ రెండుగా విరి గిపోయింది. అతన్ని కడప పట్టణంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. 


Updated Date - 2021-11-01T04:57:31+05:30 IST