ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం

ABN , First Publish Date - 2021-07-13T05:06:26+05:30 IST

ఎట్టకేలకు పట్టణంలోని వలసపల్లె రస్తాలోని ఆక్రమణల తొలగింపునకు అధకారులు సోమవా రం శ్రీకారం చుట్టారు.

ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం
ఆక్రమణల తొలగింపు వద్ద అధికారులను అడ్డుకుని కొలతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

కొలతల తేడాపై స్థానికుల నిలదీత

ఎర్రగుంట్ల, జూలై 12: ఎట్టకేలకు పట్టణంలోని వలసపల్లె రస్తాలోని ఆక్రమణల తొలగింపునకు అధికారులు సోమవా రం శ్రీకారం చుట్టారు.  టీపీవో శిరీష ఆధ్వర్యంలో  తొలగింపు ప్రారంభించారు. మార్కింగ్‌ ఇచ్చిన చోటికి ఎక్స్‌వరేటర్‌తో ఆక్రమణలు పడగొట్టుకుంటు వచ్చారు. కొన్ని చోట్ల ఆక్రమణలలో ఏకంగా రెండు మూడు అంతస్తులు కట్టుకోవడంతో వాటిని యజమానులే తొలగించుకుంటామని తెలపడంతో వదిలేశారు. పోలీసుస్టేషన్‌ వెనుకబాగాన ఉన్న ఓ ఇంటిప్రహరీని తొలగించే సమీయంలో గేటు కూలిపోయి దెబ్బతింది. దీంతో ఆఇంటి యజమాని  అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనే తొలగించుకుంటానని చెప్పనప్పటికి ఎలా కూలదోస్తారని నిలదీశారు. నష్టపరిహారం చెల్లించాలని లేదంటే ఎక్స్‌క వేటర్‌ను కదలనివ్వనని అడ్డంగా వెళ్లారు. అయితే నోటీసులిచ్చిన తర్వాత కూడా అలాగే ఉంచి కొట్టకుండా ఉంటామా అంటూ టీపీవో  సమాధానం చెప్పారు.  దీంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని అడ్డగించే వ్యక్తిని నివారించి పక్క కు పంపారు. ందని  మ్యాప్‌లో కొన్నిచోట్ల 18, 20, 23, 30 అడుగుల వెడల్పు ఉందని అలాగే  మార్కింగ్‌ ఇచ్చి ఆక్రమణలు తొలగిస్తామని టీపీవో పేర్కొన్నారు.  ఆక్రమణలు తామే తొలగించుకుంటామన్న వారు వెంటనే తొలగించుకోవాలని త్వరలో డ్రైనేజి, రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. 

Updated Date - 2021-07-13T05:06:26+05:30 IST