మౌలిక సదుపాయాలు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-03-23T04:54:21+05:30 IST

జిల్లాలో వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు వేగవంతం చేయాలని జేసీ ధర్మచంద్రారెడ్డి (సంక్షేమం) సంబంధిత అధికారులను ఆదేశించారు.

మౌలిక సదుపాయాలు వేగవంతం చేయాలి

కడప(కలెక్టరేట్‌), మార్చి 22: జిల్లాలో వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు వేగవంతం చేయాలని జేసీ ధర్మచంద్రారెడ్డి (సంక్షేమం) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఏపీ పరిశ్రమల అభివృద్ధి సలహాదారుడు రాజోలి వీరారెడ్డితో కలసి కొప్పర్తి ఇండస్ట్రీయల్‌ పార్కులో కొత్తపరిశ్రమల శంకుస్థాపన కోసం పారిశ్రామిక వేత్తలు సిద్ధం కాలవాలని కోరుతూ జేసీ ధర్మచంద్రారెడ్డి ఛాంబరులో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కొప్పర్తి ఇండస్ట్రీయల్‌ పార్కులో ఇప్పటి వరకు 90 ఎకరాల్లో 40 మంది చిన్న పరిశ్రమల స్థాపనకు ప్లాట్లు వేశారని, ఆయా పరిశ్రమల యూనిట్ల శంకుస్థాపనకు పారిశ్రామికవేత్తలు సంసిద్ధం కావాలన్నారు. వారి అభిప్రాయాలు సేకరించడానికే ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఐజీసీ జోనల్‌ మేనేజరు జయలక్ష్మీ, పరిశ్రమలశాఖ జీఎం చాంద్‌బాషా, జిల్లా కో- ఆర్డినేటరు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-23T04:54:21+05:30 IST