అక్రమాలపై స్వతంత్ర అభ్యర్థి ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-11-01T05:00:02+05:30 IST

నివారం జరిగిన బద్వేలు ఉప ఎన్నికలో జరిగిన అక్రమాలపై స్వతంత్ర అభ్యర్థి బూరగ రత్నం ఎన్నికల అఽధికారి కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

అక్రమాలపై స్వతంత్ర అభ్యర్థి ఫిర్యాదు

బద్వేలు,అక్టోబరు 31: శనివారం జరిగిన బద్వేలు ఉప ఎన్నికలో  జరిగిన అక్రమాలపై స్వతంత్ర అభ్యర్థి బూరగ రత్నం ఎన్నికల అఽధికారి కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శనివారం జరిగిన పోలింగ్‌ సమ యంలో బూత్‌ను పరిశీలిస్తున్నపుడు ఒకొక్కరు 5,6 ఓట్లు వేస్తున్నా పోలింగ్‌ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

రామాపురం పోలింగ్‌ కేంద్రంలో బయటి వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేశారని ఇన్ని అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు తక్కువ స్థాయిలో హాజరైనా ఓటింగ్‌ శాతం భారీ స్థాయిలో ఏ రకంగా పెరిగిందని  ఆయన ప్రశ్నించారు.  బద్వేలు ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషిచేస్తానన్నారు.

Updated Date - 2021-11-01T05:00:02+05:30 IST