దళితులపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-05-19T04:13:54+05:30 IST

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీ ఎస్పీ సీనియర్‌ నేత కేశవయ్య ఆరోపించారు.

దళితులపై దాడులు అరికట్టడంలో   ప్రభుత్వం విఫలం
సమావేశంలో మాట్లాడుతున్న కేశవయ్య

బద్వేలు రూరల్‌, మే 18: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీ ఎస్పీ సీనియర్‌ నేత కేశవయ్య ఆరోపించారు. మంగళవారం ప్రజా సం ఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా దళితుల పై జరుగుతున్న దాడులు ఆగడం లేదన్నారు.

చిత్తూరు జిల్లాలో క్రికెట్‌ ఆడుతున్న దళిత యువకులపై దాడులు, రైల్వేకోడూరులో ఎస్సీలు సాగు చేసుకుంటున్న మామిడి తోటలపై అగ్రవర్ణాల దాడులు జరుగు తున్నట్లు పత్రికల్లో కనబడుతున్నాయన్నారు. దళితులపై దాడులు ఆప కపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిం చారు.

కార్యక్రమంలో అంబేడ్కర్‌ ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరమణ, పిచ్చయ్య, బీఎస్పీ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నయ్య, ఎమ్మార్పీఎస్‌ దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునెయ్య, ప్రసాద్‌, రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T04:13:54+05:30 IST