‘మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే కనుమరుగవుతాం’

ABN , First Publish Date - 2021-12-31T05:05:21+05:30 IST

మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే కనుమరుగవుతామని చెన్నకేశంపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏవీ రమణయ్య పేర్కొన్నారు.

‘మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే కనుమరుగవుతాం’
కార్యక్రమంలో ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణలు

బద్వేలు, డిసెంబర్‌ 30 : మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే కనుమరుగవుతామని చెన్నకేశంపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏవీ రమణయ్య పేర్కొన్నారు. గురువారం చెన్నకేశంపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడు మాధన విజయ్‌కుమార్‌  ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్షణ సంచాలకుల ఆదేశాల మేరకు భాషోత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన కవుల చిత్రాలు, బొమ్మల చార్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. 


ఘనంగా తెలుగు భాషాదినోత్సవం

మైదుకూరు, డిసెంబరు 30 : పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం తెలుగు భాషాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి అధ్యక్షత పాఠశాల తల్లిదండ్రుల కమి టీ మహబూబ్‌ చాంద్‌ ఆధ్వర్యంలో తెలుగుతల్లి చిత్రపటం ఉంచి పూలమాల వేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలుగుభాష గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. అనంతరం స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తెలుగు వీరుల వేషాధారణలు అలరించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-31T05:05:21+05:30 IST