స్వచ్ఛభారత్‌ కార్మికుల గోడు పట్టించుకోండి

ABN , First Publish Date - 2021-07-13T05:11:32+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌, స్వచ్ఛభారత్‌ అంటూ ప్రచార ఆర్భాటాలు తప్ప అందులో పనిచేసే కార్మికుల సంక్షేమం పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు.

స్వచ్ఛభారత్‌ కార్మికుల గోడు పట్టించుకోండి
నిరసన తెలుపుతున్న స్వచ్ఛభారత్‌ కార్మిక నాయకులు

కలెక్టరేట్‌ వద్ద ఏఐటీయూసీ ధర్నా

కడప(రవీంద్రనగర్‌), జూలై 12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌, స్వచ్ఛభారత్‌ అంటూ ప్రచార ఆర్భాటాలు తప్ప అందులో పనిచేసే కార్మికుల సంక్షేమం పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌ కార్మికుల యూనియన్‌ ఏఐటీయూసి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరు కార్యాలయం ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛభారత్‌ మిషన్‌లో పనిచేస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.680 ప్రకారం కనీస వేతనం రూ.10 వేలు అమలు చేసి పెండింగులో ఉన్న నాలుగు నెలల జీతాలు తక్షణం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌.నాగసుబ్బారెడ్డి, స్వచ్ఛభారత్‌ మిషన్‌ కార్మికుల యూనియన్‌ గౌరవాధ్యక్షుడు కేసీ బాదుల్లా, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు, మద్దిలేటి, గ్రామీణ బ్యాంకు పొరుగు సేవల యూనియన్‌ నాయకుడు సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T05:11:32+05:30 IST