వైవీయూలో పది కేజీల ఉడుం గుర్తింపు
ABN , First Publish Date - 2021-07-23T05:10:58+05:30 IST
వైవీయూనివర్శిటీలోని ప్రిన్సిపాల్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఇంటర్నల్ క్వాలిటీ సెల్ విభాగంలో పది కేజీల బరువు, నాలుగు అడుగుల పొడవుతో ఉన్న ఉడుం కనిపించింది.
కడప(వైవీయూ), జూలై 22: వైవీయూనివర్శిటీలోని ప్రిన్సిపాల్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఇంటర్నల్ క్వాలిటీ సెల్ విభాగంలో పది కేజీల బరువు, నాలుగు అడుగుల పొడవుతో ఉన్న ఉడుం కనిపించింది. వైవీయూనివర్శిటీలో పచ్చదనం బొటానికల్ గార్డెన్ ఉండడం వలన సహజ వాతావరణంలో రకరకాల జీవులు యూనివర్సిటీలో కనిపిస్తుంటాయి. యూనివర్సిటీ విస్తీర్ణం పెద్దగా ఉండడంతో ఇక్కడ కుందేళ్లు, జింకలు, సీతాకొకచిలుకలు, కంజుపిట్టలు కనిపిస్తుంటాయి. ఉడుం వయస్సు సుమారు 20 సంవత్సరాలు పైగా ఉంటుందని, దీని శాస్త్రీయనామం వారనాస్ వారియర్‌గా పేర్కొంటున్నారు. ఉడుంను వైవీయూలోని బొటానికల్ గార్డెన్ పరిధిలో సంరక్షకులు మధుసూదన్‌రెడ్డికి అప్పగించి గార్డెన్ పరిసరాల్లో వదిలిపెట్టారు.