గంగమ్మ ఆలయంలో హుండీ చోరీ

ABN , First Publish Date - 2021-10-22T04:46:41+05:30 IST

రాజంపేట పట్టణం బలిజపల్లె గంగమ్మ ఆ లయంలోని హుం డీని పగలగొట్టి అందులోని నగదును దుండగులు దోచుకెళ్లారు.

గంగమ్మ ఆలయంలో హుండీ చోరీ

రాజంపేట టౌన్‌, అక్టోబరు21 :రాజంపేట పట్టణం బలిజపల్లె గంగమ్మ ఆ లయంలోని హుం డీని పగలగొట్టి అందులోని నగదును దుండగులు దోచుకెళ్లారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గంగమ్మ ఆలయ ప్రాంగణంలోని పోతులరాజు ఆలయ తాళాలు పగలగొట్టి హుం డీలోని నగదును దోచుకెళ్లారు. పాత నోట్లు చెల్లవనే ఉద్దేశ్యంతో వాటిని అక్కడే వదిలి వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-22T04:46:41+05:30 IST