డ్వాక్రా రుణాల్లో భారీ కుంభకోణం

ABN , First Publish Date - 2021-03-05T05:23:13+05:30 IST

ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామ పంచాయతీలో రెండు వీవోలు ఉన్నాయి. ఒక్కో వీవోలో 25 గ్రూపులు ఉన్నాయి. ఈ రెండు గ్రూపులకు గంగిరెడ్డి అతని భార్య సత్యవతి యానిమేటర్లుగా ఉండేవారు. వీరు దాదాపు మూడు సంవత్సరాల నుంచి గ్రూపులకు లోన్‌ లావాదేవీలు నడుపుతున్నారు. వీవోలకు అధ్యక్షులుగా ఉన్న వారి ద్వారా శ్రీనిధి,

డ్వాక్రా రుణాల్లో భారీ కుంభకోణం
పరిశీలనకు భారీ ఎత్తున తరలివచ్చిన మహిళలు

పేద మహిళల డబ్బు లక్షల్లో స్వాహా

యానిమేటర్ల చేతివాటం?

అధికారుల పరిశీలనతో వెలుగులోకి

లబోదిబో మంటున్న డ్వాక్రా గ్రూపు మహిళలు


డ్వాక్రా రుణాల్లో వెలుగు సిబ్బంది మాయాజాలం ప్రదర్శించారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు ఇచ్చే బ్యాంక్‌ రుణాలు, నెలవారి కంతుల్లో అవకతవకలకు పాల్పడ్డారు. యానిమేటర్లు మృతి చెందడంతో ఉన్నఫలంగా జరిపిన అధికారుల పరిశీలనలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో మోసపోయామని డ్వాక్రా గ్రూపు మహిళలు లబోదిబో మంటున్నారు. వివరాల్లోకి వెళితే..

 

ముద్దనూరు, మార్చి 4: ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామ పంచాయతీలో రెండు వీవోలు ఉన్నాయి. ఒక్కో వీవోలో 25 గ్రూపులు ఉన్నాయి. ఈ రెండు గ్రూపులకు గంగిరెడ్డి అతని భార్య సత్యవతి యానిమేటర్లుగా ఉండేవారు. వీరు దాదాపు మూడు సంవత్సరాల నుంచి గ్రూపులకు లోన్‌ లావాదేవీలు నడుపుతున్నారు. వీవోలకు అధ్యక్షులుగా ఉన్న వారి ద్వారా శ్రీనిధి, వీవో రుణాల కంతులు బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. కానీ గ్రూపు లావాదేవీలు మొత్తం యానిమేటర్ల ద్వారానే నడుస్తూ వచ్చా యి. శ్రీనిధి, వీవో రుణాల డబ్బులను గ్రూపు సభ్యులకు ఇవ్వకుండా స్వాహా చేశారు. గ్రూపు మహిళలు నెల కం తుల్లో, రుణాల మంజూరులో వారు చేతివాటం చూపించారు. పరమేశ్వర, వీరబ్రహ్మం, శివ, రాఘవేంద్ర మరికొ న్ని గ్రూపులకు సంబంధించిన మహిళలను భారీగా మో సం చేశారు. అయితే యానిమేటర్లు ఇరువురు ఒకరి తర్వాత ఒకరు గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందా రు. దీంతో రుణాలపై వెలుగు అధికారులు పరిశీలన చేప ట్టడంతో ఈ వ్యవహారం బయటపడింది. గ్రూపు మహిళలు రుణాలు చెల్లించినా బాకీ ఉన్నట్లు, రుణం తీసుకోకున్నా రుణం తీసుకున్నట్లు పరిశీలనలో వెల్లడయ్యాయి. దీంతో ఒక్కసారిగా గ్రూపు మహిళలు ఆందోళనకు గుర య్యారు. ఒక్క ఉప్పలూరు గ్రామ పంచాయతీలోనే దాదా పు రూ.40లక్షల కుంభకోణం జరిగినట్లు సమాచారం. ఒక్క యానిమేటర్లతోనే ఈ వ్యవహారం జరగలేదని, దీని వెనుక వెలుగు అధికారుల హస్తం ఉందని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు కోట్ల లో ఇలాంటివి జరిగినట్లు ప్రజల నుంచి ఆరోపనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనిధి అధికారులు గ్రూపు లావాదేవీల పరిశీలనను పాఠశాలలో నిర్వహించడంతో భారీ ఎత్తున డ్వాక్రా గ్రూపు మహిళలు అక్కడకు తరలివచ్చారు.


కంతుల్లో మోసం చేశారు..

- గ్రూపు మహిళలు, ఉప్పలూరు

శ్రీనిధి, వీవోలో నెలవారీ తీసుకున్న రుణానికి కంతు చెల్లిస్తున్నాం. అయితే యానిమేటర్లు లావాదేవీల తీర్మానం పుస్తకాల్లో కట్టిన కంతు రాస్తూ వచ్చారు. బ్యాంక్‌లో మాత్రం కంతులో సగమే చెల్లిస్తూ వచ్చారు. దానికి సంబంధించి రసీదులు ఇచ్చేవారు కాదు. దీంతో మాకు ఎటువంటి సమాచారం తెలిసేది కాదు. బ్యాంకు రుణం తీసుకొనే సమయంలో యానిమేటర్లే బ్యాంకు వద్దకు వచ్చి డబ్బులు తీసుకుంటారు. మా గ్రూపుకు ఎంత రుణం ఇస్తున్నారో మాకు తెలీదు. ఇచ్చింది తీసుకొనే వాళ్లం. కూలి పనులకు వెళ్లి కష్టపడిన డబ్బులు నెలనెల కంతులు కడుతున్నాం. తీసుకోని డబ్బు లక్షల్లో మాపై భారం మోపితే ఎలా?


గ్రూపుల రుణాలపై పరిశీలిస్తున్నాం..

- భాగ్యమ్మ, ఏపీఎం

గ్రూపుల రుణాలపై శ్రీనిధి అధికారుల ద్వారా పరిశీలిస్తున్నాం. ఇప్పటివరకు కొన్ని గ్రూపుల లావాదేవీలు పరిశీలించాం. యానిమేటర్లు కట్టిన కంతుల్లో తేడా ఉన్నట్లు గుర్తించాం. లక్షల రూపాయల తేడా ఉంది. అన్ని గ్రూపుల లావాదేవీలు పరిశీలిస్తాం. గ్రూపు మహిళలకు న్యాయం జరిగేలా చూస్తాం.


Updated Date - 2021-03-05T05:23:13+05:30 IST