176 మందికి ఇంటి పట్టాలు పంపిణీ

ABN , First Publish Date - 2021-01-21T04:53:47+05:30 IST

మండల పరిధిలోని పుత్తనవారిపల్లె సమీపంలో సర్వే నెంబరు 250లో వైసీపీ నాయకుడు కొల్లం గంగిరెడ్డి చేతుల మీదుగా 176 మందికి బుధవారం ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.

176 మందికి ఇంటి పట్టాలు పంపిణీ
పుత్తనవారిపల్లెలో ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న కొల్లం గంగిరెడ్డి

పుల్లంపేట, జనవరి 20 : మండల పరిధిలోని పుత్తనవారిపల్లె సమీపంలో సర్వే నెంబరు 250లో వైసీపీ నాయకుడు కొల్లం గంగిరెడ్డి చేతుల మీదుగా 176 మందికి బుధవారం ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత ఇంటి కల నెరవేరుస్తున్నారని, పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనన్నారు. కార్యక్రమంలో ఈవోఆర్‌డీ పెంచలయ్య, ఆర్‌ఐ అల్లాబక్ష్‌, వీఆర్యే భుజంగరావు, మాజీ సర్పంచ్‌ హరినాథరెడ్డి, నళినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T04:53:47+05:30 IST