Talibans నుంచి సురక్షితంగా బయటపడి.. Kadapaకు తిరిగొచ్చిన హాజీవలి

ABN , First Publish Date - 2021-08-21T05:18:33+05:30 IST

అఫ్ఘనిస్థాన దేశాన్ని తాలిబన్లు ఆక్రమించడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే....

Talibans నుంచి సురక్షితంగా బయటపడి.. Kadapaకు తిరిగొచ్చిన హాజీవలి
ప్రత్యేక విమానంలో స్వదేశానికి వచ్చిన భారత విదేశాంగ అధికారులతో హాజీవలి

  •  ఆఫ్ఘాన్ నుంచి స్వదేశానికి
  • తాలిబన్లనుంచి సురక్షితంగా బయటపడ్డ కొండాపురం వాసి


కడప/కొండాపురం, ఆగస్టు 20: అఫ్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చారు. వీరిలో కొండాపురానికి చెందిన హాజీవలి కూడా ఉన్నారు. ప్రస్తుతం అఫ్ఘనిస్థానను తాలిబన్లు ఆక్రమించుకుంటుండడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నట్లు హాజీవలి ఫోన ద్వారా ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అఫ్ఘనిస్థానలో ఆరుచోట్ల భారత రాయబార కార్యాలయాలు ఉన్నాయన్నారు. అందులో కాందహార్‌ అనే జిల్లాలో తాను విధులు నిర్వహిస్తున్నానన్నారు. ఐటీబీపీ కార్యాలయంలో 13 సంవత్సరాలుగా కమాండోగా తాను పనిచేస్తున్నానన్నారు. రెండు సంవత్సరాలుగా డిప్యుటేషనపై అఫ్ఘనిస్థానలోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్నానన్నారు.  అక్కడ నెలకొన్న భయానక పరిస్థితుల వలన భారత రాయబార సిబ్బందిని తరలించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన చేపట్టిందన్నారు.


65 మంది సురక్షితంగా బయటపడ్డాం

మన దేశానికి చెందిన 65 మంది ఆప్ఘనిస్థాన కాందహార్‌ నుంచి సురక్షితంగా బయటపడ్డామని హాజీవలి తెలిపారు. 44 మంది కమాండోలు, 15 మంది విదేశాంగ అధికారులు, ఆరుగురు చిన్నారులతో కలిసి ఈనెల 14వ తేదీ కాందహార్‌ భారత రాయబార కార్యాలయం నుంచి ఎయిర్‌పోర్టుకు బయలుదేరామన్నారు. ఎయిర్‌పోర్టుకు చేరుకోవడానికి 35 కిలోమీటర్ల మేర మెయిన రోడ్డులో ప్రయాణిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలలో మరో దారిలో ఎయిర్‌పోర్టుకు వెళ్లామన్నారు. భారత వాయుసేనకు సంబంధించి పీ-17 విమానం ద్వారా గుజరాతకు అదేరోజు సాయంత్రం 5గంటలకు చేరుకొని ఢిల్లీకి రాత్రి 7గంటలకు చేరుకున్నామని తెలిపారు. కాందహార్‌ నుంచి విమానాశ్రయానికి వచ్చేటపుడు దారిపొడవునా తాలిబన్లు దాడిచేస్తుండడంతో భయం భయంగా తప్పించుకొని సురక్షితంగా బయటపడినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-08-21T05:18:33+05:30 IST