గృహ రుణ బకాయిలు ఒకే మొత్తంలో చెల్లించాలి

ABN , First Publish Date - 2021-11-03T05:19:11+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పొందేందుకు ప్రజలు ఒకే మొత్తంలో గృహ రుణ బకాయిలు చెల్లించాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఈఈ సాంబశివుడు తెలిపారు.

గృహ రుణ బకాయిలు ఒకే మొత్తంలో చెల్లించాలి
మాట్లాడుతున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులు

పెనగలూరు, నవంబరు2 : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పొందేందుకు ప్రజలు ఒకే మొత్తంలో గృహ రుణ బకాయిలు చెల్లించాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఈఈ సాంబశివుడు తెలిపారు. మంగళవారం మండల పరిషత్‌ సభాభవనంలో ఈవోపీఆర్‌డీ పద్మభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సంపూర్ణ గృహ రుణాలు, అసంఘటిత కార్మికుల హక్కులపై గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలు, డిజిటల్‌ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, సర్వేయర్లకు అవగాహన సమావేశం జరిగింది. లేబర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ-శ్రమ్‌ పోర్టల్‌ద్వారా అసంఘటిత కార్మికులు తమ పేర్లను ఉచితంగా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ కె.మునిస్వామి, హౌసింగ్‌ ఇన్‌చార్జి ఏఈ సుధాకర్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు హరిప్రసాద్‌, రఫత్‌జాన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-03T05:19:11+05:30 IST