9 మంది ఉపాధ్యాయులకు సెలవిస్తారా!

ABN , First Publish Date - 2021-12-29T04:34:06+05:30 IST

ఉపాధ్యాయులందరూ మూ కుమ్మడిగా సెలవు పెడితే పాఠశాల ఎలా నడుపుతారని ప్రధానోపాధ్యాయుడిపై డీఈ వో ఆగ్రహం వ్యక్తం చేశారు.

9 మంది ఉపాధ్యాయులకు సెలవిస్తారా!
ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డీఈవో

ఇలాగైతే పాఠశాల ఎలా నడుపుతారు : డీఈవో ఆగ్రహం

సిద్దవటం, డిసెంబరు 28 : ఉపాధ్యాయులందరూ మూ కుమ్మడిగా సెలవు పెడితే పాఠశాల ఎలా నడుపుతారని ప్రధానోపాధ్యాయుడిపై డీఈ వో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దవటం జడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం డీఈ వో ఆకస్మికంగా తనిఖీ చేశా రు. తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఒక్కసారిగా సెలవుపై ఎలా వెళతారని హెచ్‌ఎం శ్రీరాములుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయి తే పాఠశాల ఎలా  నడుపుతారని ప్రశ్నించారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవు పెట్టిన ఉపాధ్యాయులు, హెచ్‌ఎం ఆర్‌జేడీకి వివరణ ఇవ్వాలని తెలిపారు. అలాగే విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని ఆమె స్వయంగా రుచి చూశారు. భోజనం సరిగ్గా లేదని ఏజన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మొదటి హెచ్చరిక అని ఇలాగే రెండోసారి జరిగితే వంట ఏజన్సీని మారుస్తామన్నారు. అనంతరం కమ్మపాలెంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీసీ మున్నా, ఎంఈవో పాలెం నారాయణ, సీవో సురే్‌షబాబు, గౌతమి, సమీర్‌ హుస్సేన్‌, జయలక్ష్మీ, హెచ్‌శ్రీం గంగాధర్‌, ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-29T04:34:06+05:30 IST