ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
ABN , First Publish Date - 2021-10-30T04:58:09+05:30 IST
ప్రకృతి వ్యవసాయం వలన రైతులు పండిస్తున్న పంటలకు అధిక దిగుబడులు వస్తాయని కెఎఫ్‌డబ్ల్యు ఆర్‌పీ గంగిరెడ్డి, పీఆర్పీ శ్రీనివాసులు తెలిపారు.

సింహాద్రిపురం, అక్టోబరు 29: ప్రకృతి వ్యవసాయం వలన రైతులు పండిస్తున్న పంటలకు అధిక దిగుబడులు వస్తాయని కెఎఫ్‌డబ్ల్యు ఆర్‌పీ గంగిరెడ్డి, పీఆర్పీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం సింహాద్రి పురం రైతు భరోసా కేంద్రంలో ఐసీఆర్పీలకు ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన శిక్షణలో సూర్యమండలం, కూరగాయల సాగు, కషా యాల తయారీ, వినియోగించే విధానం, నవధాన్యాల విత్తనంతో ఉద్యాన పంటలకు పెరిగే భూసారం, పీఎండీఎస్ పద్దతిపై అవగాహ న కల్పించారు. దేశీ ఆవు ప్రాముఖ్యతను వివరించారు. రసాయన పద్దతులకు స్వస్తి పలికి రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు రావా లని సూచించారు. అలా చేసినప్పుడే ప్రజలు తీసుకునే ఆహారంలో విషతుల్యం తగ్గుతుందని సూచించారు.