అంధులకు సాయం అభినందనీయం

ABN , First Publish Date - 2021-02-02T05:05:38+05:30 IST

అంధులకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని ఆదాయపు పన్ను శాఖ అధికారి రవి పేర్కొన్నారు.

అంధులకు సాయం అభినందనీయం
అంధులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, ఫిబ్రవరి 1: అంధులకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని ఆదాయపు పన్ను శాఖ అధికారి రవి పేర్కొన్నారు. సోమవారం గాజులపల్లె వెంకటసుబ్బయ్య, పెద్ద సుబ్బమ్మ సేవా సంస్థ అధ్యక్షుడు గాజులపల్లె రామచంద్రుడు 30 మంది అంధులకు ఒక్కొక్కరికి రూ.200 వంతున పింఛన్లు  అందజేశారు. అలాగే శ్రీరాములు ఒక్కొక్కరికి రూ.100 అందించారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ అధికారి రవి మాట్లాడుతూ అంధులకు ప్రతినెల 1వ తేదీన పింఛన్లు అందించడం గొప్ప విషయమని గాజులపల్లె రామచంద్రుడు మానవతా దృక్పథంతో సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోవిందరాజు, వీరయ్య, సుబ్బయ్య, రహిమాన్‌, బాష, నరసింహులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T05:05:38+05:30 IST