పులివెందులలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-10-30T05:04:02+05:30 IST

పులివెందులలో భారీ వర్షం కురిసింది. శుక్ర వారం ఉదయం 10గంటల నుంచి మధ్యా హ్నం 2:30 వరకు ఏకధాటిగా వర్షం కురి సింది.

పులివెందులలో భారీ వర్షం
పార్నపల్లె బస్టాండ్‌ వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపునీరు

అత్యధికంగా 79.4 మిల్లీమీటర్ల వర్షపాతం

గల్ఫర్‌ ద్వారా నీటి తొలగింపు 

పోరుమామిళ్లలో.....

పులివెందుల టౌన్‌/ రూరల్‌, అక్టోబరు 29: పులివెందులలో భారీ వర్షం కురిసింది. శుక్ర వారం ఉదయం 10గంటల నుంచి మధ్యా హ్నం 2:30  వరకు ఏకధాటిగా వర్షం కురి సింది. కాస్తంత తెరపిచ్చినా సాయంత్రం 4:30గంటల నుంచి రాత్రి 8 వరకు వర్షం కురవడంతో అత్యధికంగా 60మిల్లీమీటర్ల వ ర్షపాతం నమోదైనట్లు ఆటో మేటిక్‌ రెయిన్‌ ఫాల్‌ అధికారులు తెలిపారు. దీంతో పార్నప ల్లె బస్టాండ్‌, వేంకటేశ్వరస్వామి ఆలయం, యూనియన్‌ బ్యాంక్‌ ఎదురుగా, ఆర్టీసీ బస్టాండ్‌లలో దాదాపు మోకాటిలోతు వర్షపు నీరు ప్రవహించాయి. డిగ్రీ కళాశాలకు వెళ్లే రోడ్డులో మ్యాన్‌హోల్‌ నుంచి నీరు ఉప్పొంగి ప్రవహించింది. ఇదిలా ఉండగా సాగులో ఉన్న బుడ్డశనగ, వేరు శనగ, పొద్దుతిరుగుడు తది తర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకా శం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

గల్పర్‌ ద్వారా నీరు తొలగింపు

 జయమ్మకాలనీలో శుక్రవారం కురిసిన వర్షానికి నిలిచిన నీటిని గల్ఫర్‌ ద్వారా తొలగించారు. స్థానిక ప్రజలు సమాచారం ఇవ్వడంతో మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహా రెడ్డి సిబ్బందితో వెళ్లి నీటిని తొలగింపజేశారు. వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండా లన్నారు. తాగునీటిని కాచి చల్లార్చి తాగితే ఆరోగ్యానికి మంచిదన్నారు. వర్షం వలన ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే వార్డు సచివాలయంలో తెలియజేయాలన్నారు.

పోరుమామిళ్లలో జోరుగా వర్షం 

పోరుమామిళ్ల, అక్టోబరు 29: పోరుమామిళ్లలో ఎడతెరపి లేకుండా జోరుగా వర్షం కురవడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో పాత పోస్టాఫీసు వీధి, కొత్తవీధి, కాపువీధి, ఉద్దికట్ట, బలిజకోట, స్టార్‌ హైస్కూల్‌ ప్రాంతాల్లో రోడ్ల పైకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. చిరు వ్యాపారులు సైతం ఇబ్బంది పడ్డారు. 

మైదుకూరులో తెరిపివ్వకుండా....

మైదుకూరు రూరల్‌, అక్టోబరు 29: మైదుకూ రు మున్సిపాలిటీ, మండలంలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మున్సిపాలిటీ పరిధి వీధులన్నీ దాదాపు వర్షపునీటితో నిండిపోయాయి. మం డలంలో వరి, మిరప, టమోటా పంటలు అకాల వర్షంతో దెబ్బతుంటున్నాయని రైతు లు వాపోతున్నారు. గ్రామాల్లోని వీధుల్లో దో మల వ్యాప్తి విపరీతంగా ఉందని, విషజ్వరా లు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నా రు. వర్షంలో రోగాలు మరింత వ్యాప్తి చెందు తాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

79.4 మి.మీ వర్షపాతం నమోదు 

కాశినాయన అక్టోబరు29: మండలంలో శుక్రవారం ఉదయం 8గం. నుంచి సాయంత్రం 6గం వరకు 79.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఏఎ్‌సఓ అశోక్‌ తెలిపారు. ఎడతెరిపిలేని వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం మూలంగా పిడుగుపల్ల్లె సబ్‌స్టేషన్‌ పరిధిలోని ఏడు గ్రామాల్లో దాదాపు ఆరు గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అం తరాయం ఏర్పడింది. సిబ్బంది వర్షంలోనే పనిచేసి రాత్రి 8.30కు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.  





Updated Date - 2021-10-30T05:04:02+05:30 IST