జమ్మలమడుగులో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-05-22T04:49:14+05:30 IST

పట్టణంలో గురువారం రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.

జమ్మలమడుగులో   భారీ వర్షం
తేరురోడ్డు వద్ద నిలిచిన వర్షంనీరు

జమ్మలమడుగు రూరల్‌, మే 21: పట్టణంలో గురువారం రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్టాండు, ఎల్‌ఎంసీ కాంపౌండ్‌, శ్రీనారాపురం వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా తేరు రోడ్డు వద్ద, మోరగుడిలోని పలు వీధుల్లో వర్షపునీరు నిలిచింది. 

 డివిజన్‌లో వర్షపాత వివరాలు

జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లో వర్షపాత వివరాలు డివిజన్‌ స్టాటిస్టికల్‌ అధికారి రాజమన్నార్‌ తెలిపారు.  జమ్మలమడుగు మండలంలో 43.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పెద్దముడియంలో 30.0, మైలవరంలో 10.4, ముద్దనూరులో 6.4, కొండాపురంలో 17.6, రాజుపాళెంలో 1.6, ప్రొద్దుటూరులో 40.6, చాపాడులో 24.2, మైదుకూరులో 16.6, పులివెందుల 5.4, లింగాల 4.2, సింహాద్రిపురం 4.8, వే ములలో 25.0, వేంపల్లెలో 16.0, తొం డూరులో 4.2, దువ్వూరులో వర్షపాతం నమోదు కాలేదని అధికారి తెలిపారు. 

Updated Date - 2021-05-22T04:49:14+05:30 IST