భారీగా మద్యం, గుట్కా స్వాధీనం
ABN , First Publish Date - 2021-07-25T04:50:38+05:30 IST
ప్రభుత్వం నిషేధించిన గుట్కా, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకు 15 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయకుమార్ తెలిపారు.

15 మంది అరెస్టు
మైదుకూరు, జూలై 24: ప్రభుత్వం నిషేధించిన గుట్కా, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకు 15 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయకుమార్ తెలిపారు. శనివారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో శనివారం డీఎస్పీ వివరా లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మైదుకూరులో సీఐ చలపతి, ఎస్‌ఐలు సత్యనారాయణ, రఫీ తమ నిఘా సిబ్బందితో కలసి దాడులు నిర్వహించగా గూడ్స్ వాహనంలో దాదాపు రూ.2.5 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, 70 కర్నాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. మండలంలోని తువ్వపల్లెకు చెందిన సుబ్బిరెడ్డి, మైదుకూరుకు చెందిన భూపాళం సంతో్‌షలు అక్రమ వ్యాపారం చేస్తున్నారని, వీరిద్దరూ కలసి వాటిని ఇతరులకు విక్రయిస్తుండేవారని తెలిపారు. వారి వద్ద నుంచి తీసుకున్న వాటిని విక్రయిస్తున్న మేకల నాగయ్య, యామవరం బాబు, భోగ్యం నరసింహులు, రాచుకల్లు వెంకటసుబ్బయ్య, కుందేళ్ల ప్రతాప్, పల్లా లక్ష్మిరెడ్డి, ఏల్పుల రవి, సల్లగాళ్ల వెంకటసుబ్బయ్య, పొన్నాల మహేష్, వేల్పుల కొండయ్య, పెద్దపోతు బాల అంకయ్య, ఈపూరి శివయ్య, దాడిబోయిన గురు ప్రసాద్‌లను కూడా అరెస్టు చేశామన్నారు. వీరిని కోర్టులో హాజరు పెడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.