భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2021-07-25T05:15:46+05:30 IST

మండల కేంద్రమైన వల్లూరులో ఉన్న షిరిడీ సాయిబాబా, పైడికాల్వ దత్తాత్రేయ స్వామి ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
ప్రత్యేక అలంకరణలో షిరిడీ సాయి

వల్లూరు, జూలై 24:మండల కేంద్రమైన వల్లూరులో ఉన్న షిరిడీ సాయిబాబా, పైడికాల్వ దత్తాత్రేయ స్వామి ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వ్యాసభగవానుడి జన్మదినమైన ఈ పౌర్ణమిని గురుపౌర్ణిమిగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా శనివారం షిరిడీ సాయినాథుడికి తెల్లవారుజామున హారతితో మొదలైంది. అనంతరం విశేషంగా మహాగణపతికి, షిరిడీ సాయినాథుడికి, దత్తాత్రేయుడికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పూలతో అలంకరించి భక్తులకు దర్శింపజేశారు. భక్తులు కాయకర్పూరం చెల్లించి తమ మొక్కులు తీర్చుకున్నారు.  

Updated Date - 2021-07-25T05:15:46+05:30 IST