భూగర్భజలాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-26T05:04:10+05:30 IST

భూగర్భజలాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఐఐసీ సహాయ సంచాలకుడు సుబ్బారావు తెలిపారు.

భూగర్భజలాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏపీఐఐసీ అధికారులు

ఒంటిమిట్ట, అక్టోబరు25 : భూగర్భజలాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఐఐసీ సహాయ సంచాలకుడు సుబ్బారావు తెలిపారు. సోమవారం మండల పరిధిలోని చింతరాజుపల్లె గ్రామంలో భూగర్భజలాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాగు నీటి ద్వారా నీటిని రైతులు పంటలకు ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు నీటిని వృఽథా చేయకుండా పంటలను పండించుకోవాలని పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చునని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏపీఐఐసీ అధికారులు మహాలక్ష్మీ, గురవయ్య, సాహుల్‌, సర్పంచ్‌ నాగమ్మ, మాజీ సర్పంచ్‌ వెంకటయ్య, చిన్న నరసింహులు, సిద్దవటం మార్కెట్‌యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ రాసాల నరసింహనాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T05:04:10+05:30 IST