బాట పెద్దమ్మతల్లి ఆలయాన్ని తొలగించవద్దు

ABN , First Publish Date - 2021-06-22T05:42:27+05:30 IST

పట్టణంలోని జూటూరు రమయ్య కళా క్షేత్రం పక్కన గల బాటపెద్దమ్మ తల్లి ఆలయాన్ని తొలగించవద్దని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌ మాదిగ డిమాండ్‌ చేశారు.

బాట పెద్దమ్మతల్లి   ఆలయాన్ని తొలగించవద్దు

ప్రొద్దుటూరు అర్బన్‌, జూన్‌ 21: పట్టణంలోని జూటూరు రమయ్య కళా క్షేత్రం పక్కన గల బాటపెద్దమ్మ తల్లి ఆలయాన్ని తొలగించవద్దని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌ మాదిగ డిమాండ్‌ చేశారు.  ఆమేరకు సోమవారం స్థానిక డిప్యూటీ తహసీల్దారు మనోహర్‌ రెడ్డికి ఎంఆర్‌పీఎస్‌ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సుధాకర్‌ మాట్లాడుతూ 2010లో ఖాళీగా వున్న మున్సిపల్‌ స్థలంలో బాట పెద్దమ్మతల్లి ఆలయాన్ని నిర్మించారన్నారు. ఇటీవల ఆ ప్రాంతంలోని మున్సిపల్‌ హైస్కూలు గ్రౌండ్‌లో తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ను నిర్మించారని మార్కె ట్‌ కమిటీ పెద్దలు మార్కెట్‌ ఎంట్రన్స్‌లో పెద్దమ్మ తల్లి దేవళం వుంగకూడదని తొలగించమని కమిషనర్‌ను కోరారన్నారు. దీంతో కమిషనర్‌  దేవాలయం తొలగిస్తామని హెచ్చరించారన్నారు. కలెక్టర్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ఆలయాన్ని పరిరక్షించాలని కోరామన్నారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎ్‌సరాష్ట్ర కార్యదర్శి బాలలక్షుమయ్య, గంగన్న, చెన్నమ్మ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

విగ్రహాల ఏర్పాటుపై

 ప్రజాభిప్రాయం తీసుకోండి


ప్రొద్దుటూరు, జూన్‌ 21 : పట్టణంలో విగ్రహాల ఏర్పాటు చేసే సమయంలో పురజనుల మనోగతాలను తెలుసుకోవాలని వీహెచ్‌పీ నాయకులు కోరారు. ఆ మేరకు పోలీసు, రెవెన్యూ,  మున్సిపల్‌ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌, నాయకులు మార్కండేయ, రమేష్‌, డు నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T05:42:27+05:30 IST