ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-05-31T04:32:23+05:30 IST

రెండు సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించిన వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ఉండడం చూస్తే ఆశ్చర్యమేస్తోందని రైల్వేకోడూరు జనసేన నేత గంధంశెట్టి దినకర్‌బాబు తెలిపారు.

ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వం

జనసేన నేత గంధంశెట్టి దినకర్‌బాబు

రైల్వేకోడూరు, మే 30: రెండు సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించిన వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ఉండడం చూస్తే ఆశ్చర్యమేస్తోందని రైల్వేకోడూరు జనసేన నేత గంధంశెట్టి దినకర్‌బాబు తెలిపారు. ఆదివారం రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకే పెద్ద పీట వేసిందన్నారు. ఉద్యోగులకు తెలంగాణ తరహాలో ఆంధ్ర రాష్ట్రంలో పేస్కేల్స్‌ అమలు చేయలేదన్నారు. ఉద్యోగులు కూడా తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో విలేఖర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో పూర్తిగా వైసీపీ విఫలం అయిందన్నారు.  వైసీపీ అధికారం లోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు.  


Updated Date - 2021-05-31T04:32:23+05:30 IST