‘విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం’

ABN , First Publish Date - 2021-01-13T05:27:26+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన పథకాలను తొలగించి వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా అన్నారు.

‘విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం’

రాయచోటిటౌన్‌, జనవరి12: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన పథకాలను తొలగించి వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా అన్నారు. మంగళవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు విద్యకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని నాడు హామీలు ఇచ్చి నేడు కోతలతో నమ్మక ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్గీ, అగ్రవర్ణ పేద విద్యార్థులు ఈ పథకం నిలిపివేతతో వారి ఉన్నత చదువుల కలను వైసీపీ ప్రభుత్వం చెరిపివేసిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్‌ కార్యదర్శి అబుజర్‌, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు ఇనాముల్లా, 11వ వార్డు టీడీపీ అధ్యక్షుడు సోనీరాజ్‌ కలీమ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:27:26+05:30 IST