సచివాలయ వ్యవసతో ప్రజల వద్దకు పాలన
ABN , First Publish Date - 2021-12-31T05:04:15+05:30 IST
సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధాలు పేర్కొన్నారు.

గోపవరం, డిసెంబరు 30 : సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధాలు పేర్కొన్నారు. గురువారం మండలంలోని కాలువపల్లె పంచాయతీ సచివాలయ నూతన భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతి పనికి మండల కార్యాలయాలకు పరిగెత్తాల్సిన పని లేదని ఏ పంచాయతీ పనులు ఆ పంచాతీలోనే చేసుకునే విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్ వైస్‌చైర్మన్ రమణారెడ్డి, మండల ప్రత్యేకాధికారి గణేష్, జడ్పీటీసీ జయరామ్‌రెడ్డి, ఎంపీపీ ధనలక్ష్మి, ఎంపీటీసీ రాజేశ్వరి, సర్పంచ్ పసుపులేటి శ్రీనివాసులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.